తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దొరలాగ దోచుకెళ్లొచ్చు..! - మార్కెటింగ్​

రోజు రోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు సమయానికి విలువ మరింత పెరుగుతోంది. షాపింగ్​ చేసి బిల్లు కట్టడానికి కౌంటర్​ దగ్గర వేచి చూసే సమయం కూడా విలువైనదే నేడు...!

దొరలాగ దోచుకెళ్లొచ్చు..!

By

Published : Feb 9, 2019, 7:26 PM IST

దొరలాగ దోచుకెళ్లొచ్చు..!
షాపింగ్​ మాల్స్​లో క్యాష్​ కౌంటర్​ దగ్గర ఇక పడిగాపులు పడాల్సిన పని లేదు. నేరుగా షాపులోకి వచ్చి నచ్చిన సామాను బ్యాగులో వేసుకొని బయటపడడమే. గతేడాది ఈ సాంకేతిక ఒరవడికి 'అమెజాన్​ గో' తెర తీసింది. ఇప్పుడిప్పుడే అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఈ సదుపాయాలతో షాపులు వెలిశాయి. ఇవి వినియోగదారుల సమయంతో పాటు.. డబ్బునూ ఆదాచేస్తాయని చెబుతున్నారు నిర్వాహకులు.

" ఈ దుకాణాలు క్యాష్​లెస్​ మాత్రమే కాదు... క్యాషియర్​లెస్​ కూడా. షాప్​లోకి వచ్చి యాప్​ స్కాన్​ చేస్తే చాలు. ఇక మీకు నచ్చిన వస్తువులు తీసుకుని బ్యాగులో వేసుకోని వెళ్లిపోవడమే. మాల్స్​లో సాధారణంగా నిరీక్షించినట్లు ఇక్కడ వేచి చూడాల్సిన అవసరమే లేదు. "
-మార్క్ మహానే, అంతర్జాల మార్కెటింగ్​ నిపుణులు

ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టనుంది. మరో పదేళ్లలో అన్ని షాపుల్లో ఇదే తరహా నగదురహిత షాపింగ్​ అందుబాటులోకి వస్తుందని 'స్టాండర్డ్​ కాగ్నిషన్'​ సహ వ్యవస్థపాకులు మిషెల్​ సుస్వాల్​ అంచనా వేస్తున్నారు.

ఎలా పనిచేస్తాయి?

షాపులోకి మీ చరవాణిలో ఉన్న యాప్​తో ప్రవేశించాక మిమ్మల్ని పైన ఉన్న కెమెరాలు కనిపెడుతూ ఉంటాయి. నచ్చిన సరుకు బ్యాగులో వేసుకున్నాక మీ ఖాతా నుంచి నగదు షాపు ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఒకవేళ ధర ఎక్కువుందని మళ్లీ అక్కడ పెడితే, మీ ఫోన్​కి అదే వస్తువుపై ఓ ఆఫర్ ప్రకటిస్తూ​ సందేశం వస్తుంది. ఇలా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు.

ఇక్కడ కెమేరాలు వాడటం వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది. అందుకు కెమేరాలు సరిగ్గా పైన సీలింగ్​కు అమర్చాం. జీపీఎస్​ మాదిరిగా మాత్రమే పని చేస్తాయి. వినియోగదారుల ముఖాలను గుర్తించే సాఫ్ట్​వేర్​ను ఇందులో ఉపయోగించట్లేదు.
-కృష్ణ మోతుకూరి, సీయీవో, సహ వ్యవస్థాపకులు జిప్పిన్​ సంస్థ

అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో అమెజాన్​ గో తో పాటు జిప్పిన్​, స్టాండర్డ్​ కాగ్నిషన్​ స్టార్టప్​ సంస్థలు ఈ సదుపాయన్ని కల్పిస్తున్నాయి. పోలాండ్​, ఫ్రాన్స్​ దేశాల్లో కూడా ప్రజలకు ఈ షాపులు అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్నాలజీ మన దేశంలోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.!

ABOUT THE AUTHOR

...view details