భర్త తన భార్యపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఎంఎం పహాడీకి చెందిన అమాన్ 9 ఏళ్ల క్రితం నజ్మా అనే యువతిని వివాహమాడాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అమాన్ పెళ్లయిన నాటినుంచే నజ్మాను అనుమానించసాగాడు. తరచుగా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆదివారం జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన అమాన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందిందని నిర్దరించుకున్న తర్వాతే అమాన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
భార్యను చంపిన భర్త.. నిర్ధరణ తర్వాత పరారీ - RAJESH
అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను కడతేర్చి కాటికి పంపాడు ఓ భర్త. ఈ సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
హతురాలు నజ్మా