తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పెళ్లికోసం ప్రియుడిపై కిరోసిన్​ దాడి - gas

పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రియుడిని మర్యాదగా అడిగింది. యువకుడు నిరాకరించగా కిరోసిన్​తో దాడి చేసింది. కాలిన గాయాలతో వరంగల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.

ప్రియుడిపై కిరోసిన్‌ దాడి

By

Published : Mar 13, 2019, 9:21 PM IST

Updated : Mar 14, 2019, 7:08 AM IST

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కిరోసిన్‌ పోసింది ఓ ప్రియురాలు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నందనంలో రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందనం గ్రామానికి చెందిన ఓ యువతిని అదే ఊరికి చెందిన అనిల్​ అనే యువకుడు ప్రేమించాడు. వివాహం చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది సదురు యువతి.

పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కిరోసిన్​ పోసింది. అగ్గి అంటించే క్రమంలో అనిల్​ అడ్డగించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయాలతో ఉన్న యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి చేసుకోకుంటే యువతి తనను చంపుతుందని అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి:బండరాయితో మోది దారుణ హత్య

Last Updated : Mar 14, 2019, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details