లోక్సభ సమావేశాల చివరిరోజున సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో విపక్ష నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. భాజపా సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
"నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నా. ప్రస్తుత సభలో ఉన్న వారందరూ తిరిగి ఎన్నికవ్వాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు"
-ములాయం సింగ్ యాదవ్
ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తంచేస్తూ 'జై శ్రీరామ్' నినాదాలతో సభను హోరెత్తించారు భాజపా సభ్యులు.
ములాయం సింగ్ వ్యాఖ్యలను ఆశీర్వాదాలుగా భావిస్తున్నానని తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ.
భాజపా ఓటమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సమయంలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.