తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యాదాద్రీశున్ని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి - OATH

ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసి రాష్ట్రానికి చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నేరుగా యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. పునర్నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

MP KOMATIREDDY VENKAT REDDY VISIT YADADRI TEMPLE FIRST TIME AFTER HIS OATH AS PARLIAMENTARIAN

By

Published : Jun 23, 2019, 10:49 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సారిగా యాదాద్రి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో గీతారెడ్డితో పాటు ఆలయ అర్చకులు వెంకట్​రెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికారు. ఆశీర్వచనాలు అందజేసి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని... సకాలంలో వర్షాలు కురవాలని స్వామివారిని కోరుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.

యాదాద్రీశున్ని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details