తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

రాష్ట్రంలో మూడు స్థానాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని అధికారులు పర్యవేక్షించారు.

By

Published : Mar 23, 2019, 5:58 AM IST

Updated : Mar 23, 2019, 7:27 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్
తెలంగాణలో మూడు శాసనమండలి స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 73.27 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో అత్యధికంగా 89.25శాతం మంది ఓటేశారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 59.03 శాతం, ఉపాధ్యాయుల స్థానానికి 83.54 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు.
Last Updated : Mar 23, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details