ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వంట ఖర్చు కోసం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ప్రస్తుతం రూ.4.13 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. దానిని రూ.4.35కు పెంచుతూ జీవో జారీచేసింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికి ప్రస్తుతం రూ.6.18 చెల్లిస్తుండగా.. దానిని రూ.6.51 పెంచింది.
మధ్యాహ్న భోజన పథకానికి మంచి రోజులు - మధ్యాహ్న భోజన పథకానికి మంచి రోజులు
సర్కార్ బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజా పెంపుతో ఖజానాపై రూ.14.77 కోట్ల అదనపు భారం పడుతుందని పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 28,621 పాఠశాలల్లో 23,87,751 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం.. రాష్ట్రం 40 శాతం నిధులను కేటాయిస్తుంది. తొమ్మిది, పది తరగతి విద్యార్థులకు మాత్రం పూర్తిగా రాష్ట్ర సర్కారు ఖర్చులతోనే పథకాన్ని అమలుచేస్తోంది. తాజా పెంపుతో ప్రభుత్వంపై రూ.14.77 కోట్ల అదనపు భారం పడుతుందని పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: కళ్లున్నా రంగులు చూడలేడు... ఎలా గుర్తిస్తాడో తెలుసా?