నేటి నుంచి హైదరాబాద్‌లో మరో సుందరమైన పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ. 2.51 కోట్లతో నిర్మించిన మీరాలం ట్యాంక్ చెరువు పార్కును ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించనున్నారు. గ్రేటర్ పరిధిలోని జోన్‌కు రెండు మేజర్ పార్కుల చొప్పున అభివృద్ధి పనులను వేగవంతం చేసింది జీహెచ్ఎంసీ.
హైదరాబాద్ - బెంగళూరు రహదారి మధ్యలోని మీరాలం ట్యాంక్ సరస్సు రెండో అతిపెద్ద పార్కుగా రూపొందింది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా పనులు చేస్తున్నారు. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను 8 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఆకట్టుకునేలా...
మీరాలం ట్యాంక్‌లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ ఉన్న పచ్చీస్, చెస్ ఆటల మాదిరి నమూనాలను రూపొందించారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొలగించి పార్కు చుట్టూ మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ చెరువుల విభాగం ద్వారా మీరాలం చెరువు కట్ట పటిష్ఠత, కంచె ఏర్పాటు, పాత్-వే, లైటింగ్, పచ్చదనం పనులను చేపట్టారు. పార్కు ప్రవేశ ద్వారంలో వివిధ చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంది.
ఇదీ చరిత్ర..
హుస్సేన్‌సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణం కాకముందు నుంచే నగరవాసులకు మీరాలం ట్యాంక్ తాగునీరు అందించేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాన మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ 1804లో ఈ సరస్సు నిర్మించారు. టిప్పు సుల్తాన్‌పై యుద్ధం చేయడానికి మీరాలం బలగాలని పంపారు. సమరంలో గెలిచిన తర్వాత మీరాలం శ్రీరంగపట్నం నుంచి తీసుకున్న ఖజానాతో ఈ సరస్సుని కట్టారని ప్రతీతి.
ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"