ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు తమ స్థానాల్ని పదిలపర్చుకున్నారు. బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన మూడో స్థానంలోనూ, బౌలర్ పూనం యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
బ్యాటింగ్‌లో కివీస్ బ్యాట్స్ఉమెన్ సుజీ బేట్స్ తొలి స్థానంలో, వెస్టిండీస్‌కు చెందిన డాటిన్ రెండో స్థానంలో ఉన్నారు. భారత బ్యాట్స్ఉమెన్లో జెమిమీ ఆరు, హర్మన్ ప్రీత్ 9వ స్థానంలో ఉన్నారు.