నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ మంత్రి రాములును తెరాస బరిలో నిలుపుతోందని.. గతంలో మంత్రిగా పనిచేసి ఆయన ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమి లేదని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఎంపీగా తనను గెలిపిస్తే ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న రైల్వే లైను ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ.. తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగం జనార్దన్‌రెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
నేను గెలిస్తే నాగర్‌కర్నూల్‌కు రైల్వేలైన్: మల్లురవి - loksaba
లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న నాగర్‌కర్నూల్ రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి మల్లురవి.
మల్లు రవి