నాగ చైతన్య , సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నాడు. సంబంధిత ఫొటోను దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్లో పంచుకున్నాడు.
ఈ సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతం కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.