రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నామినేషన్లు గురువారంతో ముగిశాయి. చివరి రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. మొదటి విడత ఈనెల 6న, రెండో విడత 10న, మూడో విడతలో 14న పోలింగ్ జరగనుంది. ఈ మూడు విడతల్లో 538 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ముగిసిన నామినేషన్లు - nominations
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామపత్రాల దాఖలు ప్రక్రియ ముగిసింది. మూడు విడతల్లో కలిపి ఎంత మంది నామినేషన్లు వేశారనేది అధికారులు ఈరోజు వెల్లడించనున్నారు.
స్థానిక సంస్థలకు ముగిసిన నామినేషన్లు
ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. మూడో విడతలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు విడతల్లో కలిపి ఎంత మంది నామపత్రాలు దాఖలు చేశారనే వివరాలను అధికారులు ఈరోజు వెల్లడించనున్నారు.
ఇవీ చూడండి:ట్యాంక్‌బండ్‌పై అఖిలపక్ష నేతల అరెస్ట్
Last Updated : May 3, 2019, 7:33 AM IST