రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,488 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కారు దూసుకుపోతుండగా... కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు వెల్లడైన ఫలితాల్లో తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు 2,806 స్థానాల్లో, కాంగ్రెస్ ఎంపీటీసీలు 989 స్థానాల్లో, భాజపా ఎంపీటీసీ అభ్యర్థులు 176 స్థానాల్లో, తెదేపా 20, వామపక్షాలు 49, ఇతరులు 448 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. 5,659 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.
వెలువడుతున్న ఫలితాలు... వికసిస్తున్న గులాబీలు - zptc elections
ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఆధిక్యం కనబరుస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది.
గ్రామాల్లో వికసిస్తున్న గులాబీలు