తెలంగాణ

telangana

ETV Bharat / briefs

క్రికెట్​ ఆడటమే మీ కోరికా.. అయితే ఇది మీ కోసమే.. - game

అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలని ప్రతి ఆటగాడు కోరుకుంటుంటాడు. వేలాదిమంది సందడి మధ్య ఫోర్లు, సిక్సులు కొట్టాలని కలలు కంటుంటారు. ఈ కోరికను తీరుస్తుంది ప్రోయుగా స్టార్టప్. అయితే ఇదంతా నిజమైనది కాదు... అద్బుత కల్పన. క్రికెట్​ను ఇండోర్ గేమ్​గా మార్చి క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ పెట్టుకోగానే స్టేడియంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.  కోహ్లీలా కవర్‌ డ్రైవ్‌.. రోహిత్‌ శర్మలా కట్‌ షాట్‌.. ధోనీలా హెలికాప్టర్ షాట్.. వార్నర్‌లా స్విచ్‌ షాట్‌ ఆడేయచ్చు. మీరు కొట్టే సిక్స్‌లు, ఫోర్లకు ప్రేక్షకుల చప్పట్లు.. కేరింతలు.. చీర్‌లీడర్ల విన్యాసాలు.. ఇలా ఎన్నో ఆస్వాదించవచ్చు. ఇదంతా నాలుగు గోడల మధ్యే... ఓ వీఆర్ హెడ్‌సెట్‌ ధరించి... చేతిలో బ్యాటు పట్టగానే మీరున్న చోటునే మర్చిపోతారు. అంతర్జాతీయ క్రీడాకారుడూ అయిపోతారు.

క్రికెట్​ ఆడటమే మీ కోరికా.. అయితే ఇది మీ కోసమే..

By

Published : Apr 24, 2019, 11:03 AM IST

ప్రోయుగా స్టార్టప్... దేశవ్యాప్తంగా విశాఖ, హైదరాబాద్, పూణే, చెన్నై లాంటి మహా నగరాలతో పాటు విజయవాడలోనూ క్రికెట్ అభిమానులకు ఐబీక్రికెట్ పేరుతో వింత అనుభూతినిస్తోంది. వీఆర్ హెడ్​సెట్ ధరిస్తే... అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడిన అనుభూతి కలుగుతుంది. కామెంటరీ, ప్రేక్షకులు చప్పట్లు, చీర్​లీడర్ల విన్యాసాలు, మంచి మ్యూజిక్ ఇవన్నీ అదనపు ఆకర్షణలు. కాకపోతే గంటకు 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వారికైతే డిస్కౌంట్​ ఇస్తున్నారు. గంటకు 600 రూపాయలు మాత్రమే తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

క్రికెట్​ ఆడాలనే ఉత్సాహం ఉండి.. మైదానంలో ఆడే అవకాశం లేనివారితో పాటు... అంతర్జాతీయ క్రికెట్​ ఆడాలనుకునే వారికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరూ ఆ అనుభూతి పొందాలనుకుంటున్నారా...! అయితే పదండి వీఆర్​ హెడ్​సెట్​ ధరించి క్రికెట్​ ఆడేద్దాం.

క్రికెట్​ ఆడటమే మీ కోరికా.. అయితే ఇది మీ కోసమే..

ఇవీ చూడండి:సచిన్​ గురించి ఆసక్తికరమైన విషయాలు...!

ABOUT THE AUTHOR

...view details