కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వగ్రామానికి వెళ్ళిన గంగాపురం కిషన్ రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు తన సతీమణితో కలిసి వెళ్ళారు. గ్రామంలోని రామాలయంలో కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి తన ఇంటికి వెళ్లి గ్రామస్థులతో ముచ్చటించారు. అనంతరం కిషన్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు.
'స్వగ్రామంలో కిషన్ రెడ్డి సందడి' - KISHAN REDDY
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి.. ఇవాళ స్వగ్రామానికి వెళ్లారు. గ్రామస్థులతో ముచ్చటించి.. తల్లిదండ్రుల సమాధులకు నివాళులు అర్పించారు.
'స్వగ్రామంలో కిషన్ రెడ్డి సందడి'