సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వైకాపా అధినేత జగన్కువేల కోట్ల రూపాయలను పంపిణీ చేయడమే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో సామంతరాజుకు పట్టం కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే వెెయ్యికోట్ల రూపాయలను ఆంధ్రాకి తరలించారని ఆరోపించారు. తెరాస, వైకాపా, భాజపాలు ఎన్ని కుట్రలు చేసిన ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే' - crores
కేసీఆర్ తనకిస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో చంద్రబాబు వెల్లడించారు. జగన్ని అడ్డుపెట్టుకునే రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు.
chandra babu