తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రపంచ సుందరితో నటించనున్న 'మహానటి' - ponniyen selvam

మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్'​లో నటించే అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్​. ఐశ్వర్య రాయ్ ఇందులో హీరోయిన్​గా కనిపించనుంది.

ఐశ్వర్యారాయ్​తో కలిసి నటించనున్న కీర్తి సురేశ్

By

Published : Apr 3, 2019, 5:35 PM IST

గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్​​కు 'మహానటి' కథానాయికగా మంచి గుర్తింపునిచ్చింది. బాక్సాఫీస్​ దగ్గర ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ నటనే అరుదైన దర్శకుడితో పనిచేసే అదృష్టాన్నిచ్చింది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో ఓ హీరోయిన్​గా ఎంపికైంది. ఇదే సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఐశ్వర్యరాయ్​ బచ్చన్​తో కలిసి నటించనుంది. వీరిద్దరిలో ప్రేక్షకులను ఆకట్టుకునేదెవరో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, అమితాబ్ బచ్చన్, కార్తీ, మోహన్​బాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details