తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాష్ట్రం నీటితో కళకళలాడాలి: సీఎం కేసీఆర్ - projects

కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులపై ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ద్వారా మొదటి దశలోనే చెరువులను నింపాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

By

Published : Mar 30, 2019, 10:11 PM IST

Updated : Mar 31, 2019, 7:18 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర భూభాగమంతా నీటితో కళకళలాడలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమైన ఆయన... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్‌హౌజ్‌ నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులపై చర్చించారు.

చెరువులు నింపాలే..

కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలు, కాలువలు, సొరంగాల పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరందేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సాగునీటి సమర్థ వినియోగానికి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గోదావరి జలాలు ఎత్తిపోసి చెరువులు నింపాలన్నారు. వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా కాలువలకు తూములు నిర్మించాలి పేర్కొన్నారు.

ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేస్తోందని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు నీరు, వర్షం నీళ్లు అన్నీ చెరువులకు మళ్లేలా కాల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున నిర్మించిన చెక్ డ్యాముల్లో కూడా నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు.

ఇవీ చూడండి:నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్

Last Updated : Mar 31, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details