కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు ఉదయమే కేసీఆర్ జగిత్యాల జిల్లా రాంపూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించెందుకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పనులను సందర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... రెండు గంటల పాటు బురద నేలలో కాలినడకన తిరుగుతూ గోదావరి జలాల్లోకి ప్రవేశించారు. తన పక్కనే ఉన్న ఉన్నతాధికారులు మంత్రులు, ఎంపీలకు నాణేలను అందజేశారు. అనంతరం వాటిని గోదావరి పుణ్యజలాల్లో వదిలి గంగమ్మకు దండం పెట్టుకున్నారు.
తల్లి గోదావరికి దండం పెట్టుకున్న కేసీఆర్ - GODAVARI
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిలోకి దిగారు. నాణేలను వదిలి గంగమ్మకు దండం పెట్టుకున్నారు.
గోదావరి జలాల్లో గంగమ్మకు దండం పెట్టుకున్న కేసీఆర్