రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత తెరాస అభ్యర్థి కవిత. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తన మీద నమ్మకంతో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. గోదురు, వేములకుర్తి గ్రామస్థులు బోనాలు ఎత్తుకుని మంగళహారతులతో స్వాగతం పలికారు. కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
సర్పంచ్ కాని నన్ను మీరు ఎంపీని చేశారు: కవిత - nzb
గత ఐదేళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని తెరాస అభ్యర్థి కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు.
కవిత