నటుడిగానే కాకుండా నిర్మాత గానూ రాణించాడు కల్యాణ్‌రామ్. ఇటీవలే 118 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు సోషియో ఫాంటసీ కథతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. కొత్త దర్శకుడు వేణు మల్లిడి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే విభిన్నమైన టైటిల్ పెట్టినట్లు సమాచారం.
కొత్త సినిమాలో కల్యాణ్ రామ్ 'డ్యూయల్ రోల్' - 118 సినిమా
త్వరలో ప్రారంభం కాబోయే తన కొత్త చిత్రంలో కల్యాణ్‌రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు.
కొత్త సినిమాలో కల్యాణ్ రామ్ 'డ్యూయల్ రోల్'
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ , క్యాథరిన్ హీరోయిన్లుగా నటించనున్నారు.ఇంతకుముందు ‘హరేరామ్’ సినిమాలోనూ రెండు పాత్రల్లో నటించాడు కల్యాణ్.