సగమే వింటాను...!
గాంధీభవన్లోనేనా... తెలంగాణ భవన్లోకా..? - JAGGAREDDY CHITCHAT
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లోనే ఉంటారా... తెలంగాణ భవన్‌కి వెళ్తారా అనే విషయం త్వరలోనే వెల్లడిస్తానని కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచారు. కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి ఏదైనా చెప్పాలంటే... మధ్యలో ఉన్నా... ద్వారపాలకుల చేతిలోనే ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు.
తెరాసలోకి పోవాలని ప్రయత్నం చేస్తున్నాననే ప్రచారం బూటకమన్నారు. పార్టీ జెండా వల్ల గెలిచిన నేత తాను కాదని... స్వశక్తిగానే ఎదిగినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగం మాత్రమే వింటానని మిగతా సగం తన నిర్ణయాలే ఉంటాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లోనూ అదేవిధానం అవలంభిస్తున్నాని చెప్పారు. రెండు రాష్ట్రాలు కావటం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఎంత లాభం జరిగిందో తనకు తెలియదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి ఏదైన సమాచారం చేరవేయాలంటే ముందుగా ద్వార పాలకులకు చెప్పాలి... కానీ అది అక్కడికి చేరుతుందో లేదో చెప్పలేమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్
TAGGED:
JAGGAREDDY CHITCHAT