తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వీడుతున్న శాసనసభ్యుల్ని కాపాడుకోలేని దుస్థితి హస్తం పార్టీలో నెలకొందన్నారు. కుంతియా, ఉత్తమ్ కుమార్రెడ్డి నాయకత్వ వైఖరిపై మండిపడ్డారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి... పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటానని నల్గొండలో తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు, పొత్తుల వల్లే గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే' - CONGRESS
కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే 12 మంది శాసనసభ్యులు తెరాసలో చేరటం వల్ల విపక్షహోదా కోల్పోవటాన్ని జీర్ణించుకోక ముందే... మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో హస్తం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని సొంతపార్టీ పైనే తీవ్ర విమర్శలు గుప్పించారు.
interview-with-rajagopalreddy