తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా

ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈనెల 25 నుంచి జరగాల్సిన పరీక్షలను జూన్​ ఏడోతేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్​బోర్డు నిర్ణయించింది.

inter-supplementary

By

Published : May 20, 2019, 9:05 PM IST

ఇంటర్ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్​బోర్డు మరోసారి వాయిదా వేసింది. అనుత్తీర్ణులైన విద్యార్థుల ప్రశ్నాపత్రాల రీవెరిఫికేషన్​ ఫలితాలు ఈనెల 27న ప్రకటించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసింది. జూన్​ ఏడు నుంచి 14 వరకు ఇంటర్​ మొదటి, ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు జరగనున్నాయి. సప్లిమెంటరీ ప్రాక్టికల్​ పరీక్షలు జూన్​ 15 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. జూన్​ 19న నైతిక, మానవ విలువలు, జూన్​ 20న పర్యవరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్​బోర్డు కార్యదర్శి అశోక్​ తెలిపారు.

ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గురుకుల డిగ్రీ కళాశాలలు

ABOUT THE AUTHOR

...view details