ప్రస్తుత వ్యవస్థకు విఘాతం కల్గించాలన్న దురుద్దేశంతోనే ఆసియా-పసిఫిక్‌ను.. ఇండో-పసిఫిక్‌గా ప్రచారం చేస్తున్నారని అమెరికాపై విమర్శలు గుప్పించారు రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్. చైనా ఉన్నప్పటికీ.. కావాలనే అమెరికా, జపాన్ సహా పలు దేశాలు ఇండో-పసిఫిక్‌లో భారత్ పాత్ర ఎక్కువనే విధంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సమాన ప్రజాస్వామ్య క్రమాన్ని కొన్ని శక్తులు ప్రభావితం చేయరాదని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న 'రైజీనా డైలాగ్' సమావేశంలో పాల్గొన్నారు లవ్రోవ్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రెజిల్, భారత్ శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలన్నారు.
"ఆసియన్ పసిఫిక్‌ను ఇండో-ఫసిపిక్ అని పిలవాల్సిన అవసరమేంటి? చైనాను వేరు చేయాలనే ఉద్దేశమే ఇది. పరిభాష ఏకీకృతంగా ఉండాలి గాని విభజించేలా కాదు. ఎస్సీవో, బ్రిక్స్ ఇందుకు మినహాయింపు కాదు. "
-సర్జే లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి.