తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కరోనా మహమ్మారి బారినపడి 'ఇండిగో' ఉద్యోగి మృతి

విమానయాన సంస్థల నుంచి తొలి కరోనా మరణం నమోదైంది. చెన్నైలో పని చేస్తున్న తమ ఉద్యోగి కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. మృతుడి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.

IndiGo employee dies of coronavirus infection
కరోనా మహమ్మారి బారినపడి 'ఇండిగో' ఉద్యోగి మృతి

By

Published : Apr 12, 2020, 6:56 AM IST

కరోనా కాటుకు చెన్నైలో తమ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. చనిపోయిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు సంస్థ అధికారులు. అయితే మృతి చెందిన వ్యక్తి వయసు 50 ఏళ్లుపైనే ఉంటుందని తెలుస్తోంది. అతను 2006 నుంచి ఇండిగోలోనే ఎయిర్​క్రాఫ్ట్​ మెయింటెనెన్స్ ఇంజినీర్​గా పనిచేస్తునట్లు సమాచారం.

" కరోనా కారణంగా చెన్నైలో పని చేస్తున్న మా ఉద్యోగి మరణించింనందుకు మేము చాలా చింతిస్తున్నాము. ఇదీ మా సంస్థకు హృదయవిదారకరమైన ఘటన. ఇటువంటి సమయంలో మా సంస్థ అతని కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా, అన్ని విధాలా అండగా ఉంటుంది."

-ఇండిగో అధికార ప్రతినిధి.

కరోనాతో విమానయాన సంస్థల నుంచి చనిపోయిన మొదటి వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 వేల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 242 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details