పూర్వ, ప్రాథమిక దశలో పిల్లలకు చదువు చెప్పడంలో ఆమె ఓ ఉపాధ్యాయురాలు. చిన్నారులకు టీకాలు వేసిన నర్సు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రం నిర్వహకురాలు. దస్త్రావేజులు రాయడంలో ఓ రికార్డు అసిస్టెంటు. అన్ని పనులూ చేసినా కనీస గుర్తింపునకు నోచుకోని ఆమె మరెవరో కాదు అంగన్వాడీ ఉపాధ్యాయురాలు.! ప్రభుత్వ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లటంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయిలో ఏదైనా పొరపాటు జరిగితే... మూల్యం చెల్లించుకోవాల్సిందీ ఆమె!
సరికొత్త ప్రయోగానికి శ్రీకారం...
గతంలో అంగన్వాడీ ఉపాధ్యాయులందరికీ సిమ్ కార్డులు పంపిణీ చేశారు. తరువాత ఏమైందో తెలియదు కానీ... వాటి నిర్వహణను అర్ధాంతరంగా నిలిపివేసింది. తాజాగా కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (CAS) పేరిట ప్రతీ అంగన్వాడీ ఉపాధ్యాయురాలికి సెల్‌ఫోన్ పంపిణీ చేసి ఆయా కేంద్రం పరిధిలోని ప్రతీ అంశాన్ని ఆన్‌లైన్‌లో క్రోడీకరించాలని ఆదేశించింది. పాత పద్ధతిలోనైతే 14 రిజిష్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది. తాజాగా వీటన్నింటినీ క్రోడీకరిస్తూ... ఎనిమిది విభాగాలతో కూడిన స్మార్ట్‌ఫోన్లను తొలివిడతగా పాత ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపుగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నింటిలో ఈ ప్రయోగాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.
"కామన్"పై భిన్న స్వరాలు...