నాన్నకు ప్రేమతో.. - కేటీఆర్
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బేగంపేటలోని ప్రగతి భవన్లో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు కేటీఆర్ .
మొక్కలు నాటిన కేసీఆర్ కుటంబం
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి, పిల్లలు పాల్గొన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. ఆయన కుమారునిగా జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు.
Last Updated : Feb 17, 2019, 1:26 PM IST