తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కరోనా నుంచి కోలుకుంటున్నా: అఫ్రిదీ - corona virus latest news

కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు పాకిస్థాన్​ క్రికెటర్​ షాహిద్​ అఫ్రిదీ తెలిపాడు. ఇటీవలే వైరస్​ నిర్ధారణ అయిన ఈ ఆల్​రౌండర్​.. తాజాగా తన ఆరోగ్యం గురించి వస్తున్న అనేక వార్తలపై స్పందించాడు.

I am recovering: Shahid Afridi addresses rumours over his degrading health
షాహిద్​ అఫ్రిదీ

By

Published : Jun 18, 2020, 11:36 AM IST

Updated : Jun 18, 2020, 2:25 PM IST

పాకిస్థాన్​ ఆల్​రౌండర్​ షాహిద్​అఫ్రిదీ గతవారం కరోనా బారిన పడ్డాడు. అయితే, అతని ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన అఫ్రిదీ.. మొదటి మూడు రోజులు చాలా కఠినంగా అనిపించిందని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఫేస్​బుక్​ ద్వారా స్పష్టం చేశాడు.

"ఈ వీడియో చేయడానికి కారణం.. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం గురించి సోషల్​ మీడియాలో విస్తృత ప్రచారం జరగడమే. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నెమ్మదిగా కోలుకుంటున్నా. కాకపోతే నా పిల్లలను చూడలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంది. వారిని కౌగిలించుకోలేకపోతున్నా. వారిని మిస్ అవుతున్నా. కానీ మన చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచేందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం."​

షాహిద్​ అఫ్రిదీ, పాకిస్థాన్ మాజీ​ క్రికెటర్​

ఈ వ్యాధి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అఫ్రిదీ తెలిపాడు. కానీ, ఎవరికి వారుగా మహమ్మారితో పోరాడకపోతే, దాన్ని ఓడించడం కష్టమని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Last Updated : Jun 18, 2020, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details