హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడుని.. భర్త రాజేశ్ హత్య చేసి పరారయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజేశ్ గత 12 రోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చాడు. సనత్ నగర్ జింకల వాడలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడిన రాజేశ్ ఇనుప రాడ్డుతో ఊర్మిళ తలపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం తన నాలుగేళ్ల కుమారుడు కిషన్‌ను నీళ్ల బకెట్లో ముంచి చంపాడు. గమనించిన స్థానికులు పోలసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య, కుమారుడుని హత్య చేసి పరార్
హైదరాబాద్ సనత్‌నగర్ పీఎసీ పరిధిలో అమానుషం జరిగింది. భార్య, నాలుగేళ్ల కుమారుడిని భర్త రాజేశ్.. దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. 12 రోజుల క్రితం భాగ్యనగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ వాసి రాజేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దారుణ హత్య