తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కార్ల మంటలు ఆపేదెలా?

ఈమధ్య కాలంలో కార్లలో మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవించటం సర్వసాధారణమైపోయింది. బండి నడుపుతుండగా ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. చోదకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవటంవల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కార్లలో మంటలు

By

Published : Mar 15, 2019, 5:30 PM IST

Updated : Mar 16, 2019, 7:30 AM IST

కార్లలో మంటలు
ఇటీవల కార్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళకు గురిచేస్తున్నాయి. రహదారులపై కదులుతున్న కార్లలో మంటలు రావటం.. తరచు ఈ తరహా ఘటనలు జరగటం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. ఊహించని ప్రమాదాల్లో ఒక్కోసారి వాహనదారులు సజీవ దహనమైపోతున్నారు.

వరుస ఘటనలు...

కొద్ది రోజుల క్రితం సుల్తాన్‌పూర్‌ వద్ద బాహ్యవలయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. గచ్చిబౌలి వద్ద ఖాజాగూడ సమీపంలో మూడు రోజుల క్రితం కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఏపీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారి రాణా ప్రతాప్‌, కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌, మేడ్చల్​ వరంగల్​లోనూ ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటివి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

కారు మంటలకు కారణాలివే

ఇలాంటి ప్రమాదాలకు కారణం కార్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, నాసిరకం విడిభాగాలు వాడడం, అధీకృత సంస్థలు రూపొందించే గ్యాస్‌ కిట్‌లు వాడకపోవడం తదితర కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసే ముందు వాహనాలను నిపుణుల సూచనలు పాటించాలంటున్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు.

చోదకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:పోలింగ్ శిక్షణకు అందరూ రావాల్సిందే

Last Updated : Mar 16, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details