తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణ రాష్ట్రం.. సప్తవర్ణ శోభితం...

రాష్ట్రం రంగుల మయమైంది. హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా వర్ణశోభితమైన రంగులు, నీళ్లు చల్లుకుంటూ పండుగను జరుపుకున్నారు. లింగభేదం లేకుండా రోడ్లపై నృత్యాలు చేశారు.

హోలీ సందడి

By

Published : Mar 21, 2019, 8:08 PM IST

Updated : Mar 21, 2019, 10:43 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని తాకిన హోలీ సంబురాలు
రాష్ట్ర ప్రజలు హోలీ వేడుకలను సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్​లోని బేగంబజార్​లో మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. గులాల్ పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇందిరాపార్క్​లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులు సరదాగా గడిపారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్​లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో హోలీ సంబురాలు చేసుకున్నారు.
సికింద్రాబాద్​ బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగిన సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులతో కలిసి... వీధుల్లో తిరుగుతూ ఆనందాన్ని పంచుకున్నారు.

కరీంనగర్​లో హోలీ వేడుకల్లో ఎంపీ వినోద్​కుమార్, తెరాస నాయకులు పాల్గొన్నారు. గులాబీ కార్యకర్తలంతా ముఖానికి రంగులు పూసుకుంటూ... ఆనందంగా నృత్యాలు చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్న, పెద్ద తేడాలేకుండా హోలీరే.... హోలీరే.. అని పాడుకుంటూ నృత్యాలు చేశారు. ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంగుల్లో మునిగితేలారు. ఈ వేడుకల్లో బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌బాపురావు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సందడి కనిపించింది. సామాన్యులతో పాటు నేతలు, అధికారులు కూడా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చోట్ల డీజే పాటలతో జోష్ నెలకొంది.


ఇదీ చదవండి:హోలీరే హోలీ... భారతమంతా రంగుల మయం

Last Updated : Mar 21, 2019, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details