గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా సహాయ పాలనాధికారి అభిలాష అభినవ్ అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కుమురం భీం ప్రాంగణంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రుతుక్రమం సమయంలో చేయవల్సిన యోగాసనాలను ప్రగతి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్‌రాజు, అదనపు జిల్లా వైద్యాధికారి చందు, జిల్లా ఉప వైద్యాధికారి డా.వసంతరావు యువతకు పలు సూచనలు చేశారు.
రుతుక్రమంపై బాలికలకు అవగాహన కల్పించాలి - meeting
పల్లెటూళ్లలో నివసించే బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించాలని జిల్లా సహాయ పాలనాధికారి అభిలాష అభినవ్ సూచించారు. ఉట్నూరులో పలు విభాగాల సిబ్బందితో సమావేశమయ్యారు.
యువతకు పలు సూచనలు