తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సాంకేతిక రంగంలో హెచ్​సీయూ వినూత్న ఆవిష్కరణ - సాంకేతిక రంగంలో హెచ్​సీయూ వినూత్న ఆవిష్కరణ

సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన పరిశోధనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. టెలివిజన్​, ల్యాప్​టాప్​, కంప్యూటర్లలో వినియోగించే లిక్విడ్ క్రిస్టల్ డిస్​ప్లే (ఎల్​సీడీ)లను తయారు చేసే రబ్బింగ్ మిషన్ పరికరాన్ని రూపొందించింది.

సాంకేతిక రంగంలో హెచ్​సీయూ వినూత్న ఆవిష్కరణ

By

Published : May 30, 2019, 6:32 PM IST

సాంకేతిక రంగంలో హెచ్​సీయూ వినూత్న ఆవిష్కరణ

టెలివిజన్, ల్యాప్​టాప్, కంప్యూటర్, సెల్​ఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పునకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్ సురాజిత్ ధారా ఆధ్వర్యంలోని విద్యార్థుల బృందం నాలుగేళ్లపాటు శ్రమించి రబ్బింగ్ మిషన్ పరికరాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రబ్బింగ్ మిషన్​ను ఆవిష్కరించారు. ఈ పరికరంతో విదేశాల్లో తయారయ్యే ఎల్​సీడీల కంటే నాణ్యమైనవి తయారు చేయవచ్చని హెచ్​సీయూ వీసీ అప్పారావు తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే ఎల్​సీడీల ధరలు 10 రేట్లు తగ్గుతాయని వెల్లడించారు. ప్రస్తుతం కేరళలోని హోల్ మార్క్ ఆప్టో మెకట్రోనిక్స్ సంస్థ సహకారంతో ప్రొటోటైప్ లో ఉన్న రబ్బింగ్ మిషన్​ను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details