తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వికటించిన వైద్యం.. ప్రమాదంలో 38మంది కంటి చూపు

హరియాణాలో కంటి వైద్యం వికటించి 38 మంది ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వీరందరూ తీవ్ర కంటి నొప్పితో రోహ్​తక్​లోని పీజీఐఎమ్​ఎస్​లో చికిత్స పొందుతున్నారు.

హరియాణాలో కంటి వైద్యం వికటించి 38 మంది ఆసుపత్రిలో చేరారు

By

Published : Mar 28, 2019, 10:58 PM IST

కంటిచూపును మెరుగుపరుచుకోవడం కోసం చేయించుకున్న శస్త్రచికిత్సే హరియాణాలోని 38 మందికి ముప్పుగా మారింది. వేర్వేరు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం​ చేసుకున్న 38 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి ఇన్ఫెక్షన్, తీవ్రమైన నొప్పితో బాధితులు రోహ్​తక్​లోని పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ ఇన్​స్టిట్యూట్​​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(పీజీఐఎమ్​ఎస్)లో చేరారు. కంటి నుంచి చీము కారుతున్నందున కొంతమంది పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

వీరందరి కంటి చూపును మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందనివైద్యులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది భివానీ, కర్నల్​, ఝాజ్జర్​ జిల్లాలకు చెందినవారేనని పేర్కొన్నారు.

హరియాణాలో కంటి వైద్యం వికటించి 38 మంది ఆసుపత్రిలో చేరారు

ABOUT THE AUTHOR

...view details