ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్‌ను తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్.
పంజాబ్ కుర్రాళ్లు నా కోసం కప్పు గెలుస్తారు : గేల్ - KXIP
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను తమ జట్టే కైవసం చేసుకుంటుందని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తన కోసం జట్టులోని కుర్రాళ్లు కప్పు గెలుస్తారని చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ జట్టు కప్పు గెలుస్తుందన్న క్రిస్ గేల్
మొదటి మ్యాచ్‌లో మేం గెలవకపోయిన పెద్ద ఇబ్బంది లేదు. కానీ విజయం సాధించాం. ఇంగ్లండ్ సిరీస్ నుంచి నేను మంచి ఫామ్‌లో ఉన్నా. ఐపీఎల్‌ను అదే రీతిలో ప్రారంభించాలనుకున్నాను. ఇది శుభపరిణామం. జట్టు కుర్రాళ్లు రోజు రోజుకూ మెరుగవుతున్నారు. నా కోసం ఈ సీజన్లో కప్పు సాధిస్తారు - క్రిస్ గేల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్
సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. 79 పరుగులు చేసిన గేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
2019 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడీ కరీబియన్ క్రికెటర్.