రాష్ట్రంలో ఆసరా పథకం కింద బడుగు వర్గాలకు వివిధ రకాల పింఛన్లను అందజేసేందుకు ఆర్థిక శాఖ 4 వేల 361 కోట్ల 79లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలవారీ పింఛను మొత్తాన్ని జూన్ నుంచి రెట్టింపు చేసి ఇస్తున్నందున.. వాటికోసం అదనంగా నిధలు విడుదల చేసింది. లబ్ధిదారులకు ఏప్రిల్, మే నెలలకు పాత పింఛన్లు, జూన్ నుంచి సెప్టెంబరు వరకు రెట్టింపు పింఛన్లను ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిధులను వినియోగిస్తుంది. పింఛన్ల కోసం 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించిన సంగతి విదితమే.
ఆసరా పింఛన్ల కోసం రూ.4,361కోట్లు విడుదల - penssions
ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసరా పింఛన్ల కోసం రూ.4,361కోట్లు విడుదల