సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రెండు మూడేళ్లుగా తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, పట్టాలు చేయకుండా... డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
అవినీతికి పాల్పడుతున్న అధికారులను తొలగించండి - FORMER PROTEST
ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెబుతోంది. కానీ గ్రామాల్లోని అధికారులు మాత్రం వారి చేతివాటం చూపిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి తమను ఇబ్బంది పెడుతున్న రెవెన్యూ అధికారులను వెంటనే తొలగించాలంటూ రైతులు ఆందోళన చేశారు.
రైతుల ఆందోళన...
ఇవీ చూడండి: తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
TAGGED:
FORMER PROTEST