తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​రెడ్డితో అటవీ శాఖ ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు భేటీ అయ్యారు. సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణకు ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటుచేయాలని కోరారు.

అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు

By

Published : Jul 2, 2019, 7:44 PM IST

Updated : Jul 2, 2019, 8:11 PM IST

అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు

అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి భరోసానిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు. సిబ్బందిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వినతిపత్రం సమర్పించారు. నిందితులపై పీడీ యాక్టు ప్రయోగించాలని, కేసుల విచారణకు ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటుచేయాలని విన్నవించారు.

సార్సాల దాడిని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుందన్న మంత్రి, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులు చేయడం గర్హనీయమన్నారు. అధికారులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. అటవీ సిబ్బందికి పోలీసు శాఖ సహాయంతో రక్షణ కల్పిస్తామన్నారు. అడవుల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఐకాస ప్రతినిధులకు మంత్రి సూచించారు.

ఇవీ చూడండి: అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి

Last Updated : Jul 2, 2019, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details