తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పేరు మార్చుకున్న 'చిత్రలహరి' కథానాయకుడు

లక్ కోసం పేరు మార్చుకున్న హీరోల్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేరాడు. తన పేరును సాయి తేజ్​గా మార్చుకున్నాడు.

పేరు మార్చుకున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్

By

Published : Mar 22, 2019, 8:39 AM IST

నటీనటులు, రాజకీయ నాయకులు లక్ కోసం పేరు మార్చుకోవడం చూస్తుంటాం. శివశంకర్ వర ప్రసాద్ కాస్త చిరంజీవిగా మారాడు. కల్యాణ్​బాబు.. పవన్​కల్యాణ్ అయ్యాడు. ఇప్పుడు ఆ జాబితాలో మరో మెగా హీరో చేరాడు. అతడే సాయిధరమ్ తేజ్. ఇటీవల విడుదలైన 'చిత్రలహరి' సినిమాలోని 'పరుగు పరుగు' లిరికల్ వీడియోలో సాయి ధరమ్ తేజ్ పేరును 'సాయి తేజ్' అని వేశారు. రాబోయే చిత్రం టైటిల్స్​లోనూ అదే పేరు రానుందని సమాచారం.

ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, సునీల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details