ప్రజలు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సినీనటి అమల తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఫిల్మ్నగర్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. విధి నిర్వహణలో అమరులైన అగ్నిమాపక దళాలకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. అగ్నిమాపక శాఖ ఉపయోగిస్తున్న వివిధ రకాల పరికరాలు, వాహనాలను పరిశీలించారు. ప్రతి వీధిలో మొబైల్ అగ్నిమాపక వాహనం ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలని ఆమె కోరారు.
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం - Amala
విపత్కర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేసే కృషి అభినందనీయమని కొనియాడారు సినీ నటి అమల.
అగ్నిమాపక శాఖ వారోత్సవాలు