తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతాం:ఎన్​పీపీ - ఎన్​పీపీ

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడితే తక్షణమే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతామని ఎన్​పీపీ హెచ్చరించింది.

ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతామని మేఘాలయ సీఎం కన్రాద్​ ఏ సంగ్మా

By

Published : Feb 11, 2019, 9:23 PM IST

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తాము ఎప్పటి నుంచో వ్యతిరేస్తున్నామని నేషనల్​ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాద్​​ ఏ సంగ్మా ఈటీవీ భారత్​ ముఖాముఖిలో మరోసారి స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతామని తేల్చి చెప్పారు. ఈ బిల్లు ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని తెలిపారు సంగ్మా.

రాజ్యసభలో చర్చించే అంశాల జాబితాలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పొందుపరచలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ బిల్లును ఎగువసభలో ఆకస్మికంగా ప్రవేశపెట్టే అవకాశముందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం గణ పరిషత్​​(ఏజీపీ) ఎన్డీఏ కూటమి నుంచి ఇదివరకే తప్పుకుంది.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కోరుతున్నాయి. దిల్లీలో ప్రముఖ రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల నాయకులు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details