ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతి రెడ్డి హత్యకు గురైంది. సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డేతో కలిసి వచ్చింది. మంగళవారం రాత్రి ప్రీతిరెడ్డి కారులోనే ఓ సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రీతిరెడ్డిని మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
భారతీయ వైద్యురాలి మృతి
ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతి రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం తన మాజీ ప్రియుడు డా. హర్ష్ నర్డేతో సిడ్నీకి వచ్చిన ఆమె తన కారులోనే సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది.
కాన్ఫరెన్స్‌కు వచ్చి...
సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్న ప్రీతిరెడ్డి.. ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్కు వచ్చింది. ఆదివారం బసచేసిన హోటల్ నుండి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా మెక్ డోనాల్డ్‌కు వెళ్ళినట్లు సీసీ కెమెరాలో నమోదైందని ఘటనపై దర్యాప్తు చేస్తున్న సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ప్రీతి హత్య విషయం తెలియగానే సహోద్యోగులు షాక్ తిన్నారు.
ప్రీతి మృతదేహం సూట్ కేసులో లభ్యమవడం, ఆమె మాజీ ప్రియుడు తరువాత రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో... ఈ వ్యవహారం మిస్టరీగా మారింది.