ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మోదీ చేపట్టిన అభివృద్ధికి దేశ ప్రజలు మళ్లీ పగ్గాలు ఇచ్చారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన దావత్ ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషాతో పాటు ముస్లీం సోదరులకు కర్జూరం తినిపించారు. భాజపా ముస్లిం సంక్షేమ పార్టీ అని...రాష్ట్ర ప్రజలు ఆదరించాలని కోరారు.
భాజపా ముస్లిం సంక్షేమ పార్టీ: లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ హాజరయ్యారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
భాజపా ముస్లీం సంక్షేమ పార్టీ : లక్షణ్
ఇవీ చూడండి : తడిసిన బ్యాలెట్ పత్రాలు...