తెలంగాణలో భాజపా ఎక్కువ శాతం పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కమలం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి ప్రచారం చేస్తానని రవీంద్ర కుమార్ తెలిపారు.
మరోసారి మోదీ ప్రధాని కావాలంటూ.. సైకిల్ యాత్ర - bjp activist
కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావాలని కోరుతూ.. జగిత్యాల జిల్లాకు చెందిన రవీంద్ర కుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సైకిల్‌పై పర్యటించి కమలం పార్టీకి మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాడు.
సైకిల్ యాత్ర
Last Updated : Mar 21, 2019, 9:20 AM IST