తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బ్యాడ్మింటన్​ క్రీడాకారున్నీ వదలని సైబర్​ నేరగాళ్లు

సైబర్​ నేరగాళ్లు ఎవ్వరినీ వదలట్లేదు. బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు ఎస్​ఎం. ఆరీఫ్​ దగ్గర సుమారు రూ.44 లక్షలకుపైగా స్వాహా చేసి ప్లేటు ఫిరాయించారు. ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు... కాల్​డేటా ద్వారా పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

By

Published : Jun 13, 2019, 2:49 PM IST

CYBER_CHEATING

బీమా సంస్థలో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం.ఆరీఫ్​ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.44 లక్షలకు పైగా స్వాహా చేసి ప్లేటు ఫిరాయించారు. మోసపోయానని గమనించిన ఆరిఫ్... సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు... నోయిడాలోని ఐటీ సొల్యూషన్స్ కంపెనీకి చెందిన సునీల్ గుప్త, రాజ్​హన్స్​ను నిందితులుగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి బీమా కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరగా... 5లక్షలు పెట్టుబడి పెట్టారు. వడ్డీని పెట్టుబడిలో కలిపామంటూ ఆరీఫ్​ను నమ్మించారు. ఏడాదిన్నర వ్యవధిలో 20మందికి పైగా తనతో మాట్లాడి బీమా సంస్థలో లాభాల గురించి వివరించటం వల్లే నమ్మి పెట్టుబడి పెట్టినట్లు పోలీసులకు ఆరీఫ్​ వివరించారు. ఇలా పలు దఫాల్లో రూ. 44 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details