తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మమ్మల్ని గెలిపించండి రూ. 9వేల పింఛను ఇస్తాం'

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లోక్​సభ మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ. 9వేలను పింఛనుగా ఇస్తామని ప్రకటించింది.

సీపీఐ మేనిఫెస్టో విడుదల

By

Published : Mar 29, 2019, 11:46 PM IST

కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రూ. 9 వేల రూపాయలను పింఛనుగా అందిస్తామని ప్రకటించింది. సీపీఐ ఎన్నికల ప్రణాళిక లోని మరికొన్ని అంశాలు...

⦁ దిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాలకు పూర్తిస్థాయి రాష్ట్రహోదా

⦁ రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ

⦁ వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం

⦁ ఉపాధి హామీ పనిదినాల్ని 200కు పెంపు

⦁ వ్యవసాయ కూలీలకు కనీస వేతనం

⦁ సైన్యానికి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్

⦁ పీడీఎస్​ పథకాన్ని అందరికీ వర్తింపజేయడం

⦁ ఆరోగ్య రంగానికి జీడీపీలో 6శాతం వాటా

⦁ ఎన్నికల కమిషన్, కాగ్, సీబీఐ, ఆర్​బీఐ, సీవీసీలకు స్వతంత్ర ప్రతిపత్తి

ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా అధికార భాజపాపై విరుచుకుపడ్డారు సీపీఐ నేత డి.రాజా. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. మోదీ విదేశాంగ విధానం విఫల ప్రయోగమని వెల్లడించారు. ఆర్​ఎస్​ఎస్ భావజాలంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:లండన్​ కోర్టులో నీరవ్​కు రెండోసారి భంగపాటు

ABOUT THE AUTHOR

...view details