యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోదాలు నిర్వహిస్తున్నామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
భూదాన్ పోచంపల్లిలో నిర్బంధ తనిఖీలు - dcp
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తరచూ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తామని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
నిర్బంధ తనిఖీలు