విపక్షం వాకౌట్ - విపక్షం వాకౌట్
పంచాయతీ రాజ్ బిల్లు విషయంలో ప్రభుత్వం-విపక్షం మధ్య వాగ్వాదం కాంగ్రెస్ వాకౌట్కు దారితీసింది. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారని భట్టి ఆరోపించారు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు.
విపక్షం వాకౌట్
పంచాయతీ రాజ్ బిల్లును ఆ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఅసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సవరణలపై చర్చ జరగాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. సమయాభావం వల్ల సాధ్యం కాదంటూ స్పీకర్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. చర్చ జరగకుండా ఆమోదం లభించడంతోసభలో ప్రతిపక్షానికి సరైన గౌరవం ఇవ్వటం లేదని భట్టి వాపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు.