ప్రాజెక్టులు ఎవరు కట్టినా సమర్థించాలనే ఉద్దేశంతోనే తాను కేసీఆర్‌ను అభినందించానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హరీశ్ రావు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 30 ఏళ్లలో కాంగ్రెస్ ఏ ప్రాజెక్ట్ కట్టలేదంటూ హరీశ్ రావు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీశ్ నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, జూరాల, ఎస్ఎల్బీసీ, దేవాదుల ప్రాజెక్ట్‌లు కట్టింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. తాము కట్టిన ప్రాజెక్ట్‌ల నుంచి తాగు..సాగు నీరు ప్రజలకు అందాయన్నారు. 40 ఏళ్లుగా సింగూరు, మంజీరా నీళ్లు జనం తాగుతలేరా అన్నారు.
కేసీఆర్ మెప్పుకోసమే